చిరుని కలిసిన శ్రీను వైట్ల కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నలా

చిరుని కలిసిన శ్రీను వైట్ల కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నలా

0
100

ఒకప్పుడు కమర్షియల్ హీరోలతో వరుస సక్సెస్ లు పొందాడు దర్శకుడు శ్రీను వైట్ల, ఇక ఆ తరువాత వరుసగా హిట్లు రాక పరాజయాలు వచ్చాయి. ఇక తర్వాత అగ్రహీరోలు కూడా అవకాశాలు తగ్గించారు.. ఇక కథలపై ఫోకస్ చేసినా హీరోలు పెద్దగా ఒకే చెప్పిన కథలు లేవు .. దీంతో శ్రీనువైట్ల సినిమాల్లో కాస్త జోరు తగ్గించారు.

తాజాగా కొరటాలతో సినిమా షూటింగులో ఉన్న చిరంజీవిని శ్రీను వైట్ల కలుసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే అక్కడ లోకేషన్ కు శ్రీను వైట్ల వెళ్లారట, అంతేకాదు తన దగ్గర ఉన్న లైన్ గురించి చిరుకి చెప్పారు అని తెలుస్తోంది.

ఇక ఫుల్ టైం సినిమాలు చేయాలి అని చూస్తున్న చిరుకి మంచి పాయింట్ తో కథ చెప్పారట.. అయితే ఆ లైన్ బాగుంది అని అంటున్నారు.. అయితే ఇంకా కథపై వర్క్ చేయాలి అని చిరు సలహ ఇచ్చారట, మరి చూడాలి ఇది వాస్తవమా కాదా అనేది.. ఇక గతంలో చిరంజీవితో శ్రీను వైట్ల అందరివాడు .. చరణ్ తో చేసిన బ్రూస్ లీ .. వరుణ్ తేజ్ తో చేసిన మిస్టర్
చేసిన విషయం తెలిసిందే.