దీపావళి నుంచి చిరు కొత్త సినిమా..ఊర మాస్‌ కథతో..

Chiru new movie from Diwali..with the story of Oora Mass ..

0
97

మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయంలో దూకుడు పెంచుతున్నారు. ఆయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవుతుండగా..’గాడ్‌ ఫాదర్‌’ సెట్స్‌పై ముస్తాబవుతోంది. వీటితో పాటు దర్శకులు మెహర్‌ రమేశ్, బాబీలతోనూ చిరు సినిమాలు చేయాల్సి ఉంది. అయితే వీటిలో ముందుగా బాబీ చిత్రమే ప్రారంభం కానున్నట్లు తెలిసింది. దీన్ని చిరు, దీపావళి సందర్భంగా నవంబరు 6న మొదలుపెట్టనున్నట్లు సమాచారం.

ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు మొదలైనట్లు తెలుస్తోంది. శక్తిమంతమైన మాస్‌ మసాలా కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలిసింది. ఆ మధ్య చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రీలుక్‌తో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ చిత్రం కోసం ‘వాల్తేరు వాసు’తో పాటు పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తుండగా..మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

అలాగే ‘భోళా శంకర్‌’ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. తమిళంలో విజయవంతమైన ‘వేదాళం’కు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. మెహర్‌ రమేష్‌ తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్‌ స్వరాలందిస్తున్నారు.