చిరు సినిమాకి దర్శకుడు సుకుమార్ కాదట – వేరేవారికి ఇస్తారట

చిరు సినిమాకి దర్శకుడు సుకుమార్ కాదట - వేరేవారికి ఇస్తారట

0
86

మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన లూసిఫర్ … ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే …క్లాసిక్ మూవీగా అందరి ప్రశంసలు అందుకుంది. వివేక్ ఒబెరాయ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది, నేచురాలిటీకి చాలా దగ్గరగా సినిమా తాశారు అనే చెప్పాలి, ఈ సినిమాలో విమర్శలు అసలు రాలేదు, విమర్శకులు సైతం ప్రశంసలు ఇచ్చిన ఆ ఏడాది మేటి చిత్రంగా నిలిచింది.

ఇక తెలుగులో ఈ సినిమా రీమేక్ అవుతుంది అని కొన్ని వార్తలు గతంలో వినిపించాయి.. తాజాగా ఈ సినిమాలో చిరంజీవి నటిస్తారు అని తెలుస్తోంది. తిరుపతి ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా రానుందట. ఈ సినిమాని దర్శకుడు సుకుమార్ చేస్తారు అని వార్తలు వచ్చాయి.. దానికి కారణం ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ సుకుమార్ రాశారు.

అయితే ఆయన బిజీగా ఉండటంతో దర్శకత్వం వేరే దర్శకుడు చేస్తారు అని తెలుస్తోంది. అయితే చిరంజీవి కొరటాల సినిమా తర్వాత ఈ సినిమాని పట్టాలెక్కించనున్నారట, దీనిపై త్వరలోనే ప్రకటన కూడా రానుంది అని తెలుస్తోంది.