చిరు నెక్ట్స్ మూవీ ఆ స్టార్ డైరెక్టర్ తోనే…..

చిరు నెక్ట్స్ మూవీ ఆ స్టార్ డైరెక్టర్ తోనే.....

0
89

ఖైదీ నెంబర్ 150తో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి అప్పటి నుంచి ఏ మాత్రం సమయాన్ని వృదా చేయకున్నారు… ఈ చిత్రం హిట్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సైరా నరసింహారెడ్డి… ఈ చిత్రాన్ని తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు…

ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసిన సంగతి తెలిసిందే… ఇప్పుడు చిరు 152 చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తీస్తున్నాడు… వినోదానికి సందేశానికి జోడించి కొరటాల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు… ఈ చిత్రం ఆగస్ట్ లో విడుదల చేయాలని చూస్తున్నారు…

ఆ తర్వాత సినిమా దర్శకుడు సుకుమార్ తో చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం… వాస్తవానికి కొరటాల శివ సినిమా పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమాను తీయాలనుకున్నారు.. అయితే కొరటాల సినిమా పూర్తి అయ్యేలోపు చాలా టైం వేస్ట్ అవుతుందని ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ కమిట్ అయ్యాడు.. దీంతో చిరు తన చిత్రాన్ని సుకుమార్ తో తీసేందుకు నిర్ణయించుకున్నట్లు టాక్… ఈ చిత్రానికి మైత్రీ మూవీస్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారని సమాచారం…