ఒకే సినిమాలో చిరు-పవన్..బాబి ప్లాన్ మామూలుగా లేదు!

Chiru-Pawan in one movie..Bobby plan is not normal!

0
90

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ హంగామా న‌డుస్తుంది. స్టార్ హీరోలు క‌లిసి సెన్సేష‌న్స్ క్రియేట్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి- ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌నం సృష్టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు అనే టాక్ వినిపిస్తుంది. రీసెంట్‌గా చిరంజీవి కథానాయకుడిగా 154వ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రం డిసెంబ‌ర్‌లో సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

తాజాగా చిత్రానికి సంబంధించి వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని చిరంజీవి బ్రదర్ పాత్ర కోసం చూపించేందుకు బాబి ఆస‌క్తిగా ఉన్నాడ‌ట‌. ఇందుకోసం ప‌వ‌న్‌ని సంప్ర‌దించిన‌ట్టు కూడా టాక్ న‌డుస్తుంది. ఆ పాత్ర చాలా బలంగా ఉంటుందని.. నేరుగా సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ నే రంగంలోకి దించితే ఆ పాత్ర ఇంకా బాగా పండుతుందని..దాంతో పాటు సినిమా మైలేజ్ వస్తుందని బాబి ప్లాన్ చేస్తున్నార‌ట‌.

గతంలో పవన్​.. చిరు నటించిన ‘శంకర్​దాదా జిందాబాద్’​లో అతిథి పాత్రలో మెరిశారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తారని ఊహాగానాలు వినిపించినా ఆ కాంబో ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు ఈ మెగాబ్రదర్స్​ కలిసి నటించేందుకు సిద్ధమయ్యారని మరోసారి సిద్దమైనట్టు తెలుస్తుంది. మ‌రి ఇందులో నిజం ఎంత ఉంద‌నేది రానున్న రోజుల‌లో తేల‌నుంది.