చిరు ప్రకటనతో కృష్ణ అభిమానులు ఏం చేస్తున్నారో చూడండి

చిరు ప్రకటనతో కృష్ణ అభిమానులు ఏం చేస్తున్నారో చూడండి

0
92

టాలీవుడ్ లో సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా దాసరి ఉండేవారు ..ఆయన కాలం చేసిన తర్వాత, ఆ పెద్ద దిక్కుగా మన మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్ర్రీకి ఉంటున్నారు అనే చెప్పుకోవాలి… ఎక్కడ ఏ చిత్ర కార్యక్రమం జరిగినా మెగాస్టార్ వెళుతున్నారు, పెద్దరికంగా వారికి చెబుతున్నారు, ఇక మెగాస్టార్ కు ఉన్న అభిమానులు సౌత్ ఇండియాలో మరెవరికి లేరు అనే చెప్పాలి, తాజాగా సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హజరు అయ్యారు..

ఈ సమయంలో ఆయన సూపర్ స్టార్ కృష్ణ గురించి కొన్నీ కీలక వ్యాఖ్యలు చేశారు, ఇవి సూపర్ స్టార్ కృష్ణ అభిమానులనే కాదు అందరిని కూడా ఆకట్టుకున్నాయి. నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావాలి అని కోరారు, దీనిపై ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు పరిశీలించాలి అని, ఆయన పేరు కేంద్రానికి నామినేట్ చేయాలి అని చెప్పారు. ఇది నా డిమాండ్ ఆయన అభిమానుల డిమాండ్ కాదని తెలుగువారి అందరి కోరిక అని చెప్పారు చిరంజీవి.

ఎందుకు అంటే ఇండియాలో దాదాపు 350 చిత్రాల్లో నటించారు. నిర్మాతగా చేశారు కొత్త స్టూడియో నిర్మించారు, ఎందరికో లైఫ్ ఇచ్చారు, కొత్త టెక్నాలజీ సినిమాల్లో పరిచయం చేశారు.. రిస్క్ చేసి అయినా సినిమాలు తీసేవారు, అలాంటి ఓ గొప్పనటుడికి, ఆ గౌరవం దక్కాలి అని చిరు కోరారు. అయితే దీనిపై కృష్ణ అభిమానులు మహేష్ బాబు అభిమానులు చిరుకి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పాజిటీవ్ కామెంట్లు పెడుతున్నారు, ఆయన గొప్ప మాట చెప్పారని మా కోరిక చిరు నోటి వెంట వచ్చింది అని ఘట్టమనేని అభిమానులు అంటున్నారు.