దాసరి గారు నాకు తాతయ్య అవుతారు

దాసరి గారు నాకు తాతయ్య అవుతారు

0
110

ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ద‌ర్శ‌క‌సంఘం హైద‌రాబాద్ లోని సంస్థ కార్యాల‌యంలో డైరెక్ట‌ర్స్ డేని సెల‌బ్రేట్ చేసుకున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవి ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో చిరంజీవి మాట్లాడుతూ… దాస‌రితో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా.. దాస‌రితో ఉన్న బంధుత్వాన్ని బ‌య‌ట‌పెట్టారు చిరు.

దాస‌రిగారితో నేను ఒకే సినిమా చేశాను. సినిమాల కంటే వ్య‌క్తిగ‌తంగా మా మ‌ధ్య‌ మంచి అనుబంధం ఉంది. చివ‌రి రోజుల్లో ఆ అనుబంధం మ‌రింత బ‌లంగా మారింది. చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే నాకు, ఆయ‌న వ‌రుస‌కు తాత అవుతారు. ఈ విష‌యాన్ని దాస‌రిగారు చాలా సంద‌ర్భాల్లో చెప్పారు కూడా. అన్నారు..