చిరు సాయంతో ఆప‌రేష‌న్ పూర్తి ద‌టీజ్ మెగాస్టార్

చిరు సాయంతో ఆప‌రేష‌న్ పూర్తి ద‌టీజ్ మెగాస్టార్

0
85

మెగాస్టార్ చిరంజీవి ఆప‌ద‌లో ఉన్న వారిక సాయం చేయ‌డంలో ముందు ఉంటారు… కాని ఆ సాయం గురించి బ‌య‌ట పెద్ద‌గా ఎవ‌రికి తెలియ‌దు.. ఇక మెగా ఫ్యామిలీ అభిమానుల‌కి ఏ క‌ష్టం వ‌చ్చినా లోక‌ల్ అభిమాన నాయ‌కుల ద్వారా సాయం కూడా అందిస్తారు.

ఇక మెగాస్టార్ శ్రీ కొణిదెల చిరంజీవి గారి సహాయంతో ఈ రోజు రాజనాల నాగలక్ష్మి గారి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది అని . స్టార్ హాస్పిటల్ చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎమ్. గోపీచంద్ గారి ఆధ్వర్యంలో సుమారు 3.30 నిమిషాలు ఆపరేషన్ సమయం పట్టింది అని తెలుస్తోంది.

ఈ సర్జరీ చాలా విజయవంతం అయ్యిందని. ఈ రోజు మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. ఆమెకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సక్సెస్ ఫుల్ గా ఆప‌రేష‌న్ జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఆపరేషన్ గురించి మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే వున్నారు అని స్వామి నాయుడు తెలిపారు.ఆమె ఆప‌రేష‌న్ కు స‌హ‌క‌రించిన వారికి అంద‌రికి మెగాస్టార్ చిరంజీవి ధ‌న్య‌వాదాలు తెలిపారు.