చిరు కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

Chiru starts shooting for a new movie

0
94

మెగాస్టార్‌ చిరంజీవి కొత్త చిత్రం ‘భోళా శంకర్’ సినిమా షూటింగ్​ ప్రారంభమైంది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గురువారం ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్‌లో ఎంతో వేడుకగా జరిగింది.

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్‌, హరీశ్‌ శంకర్‌, బాబీ, గోపీచంద్‌ మలినేని, వంశీ పైడిపల్లి, కొరటాల శివ ఈ వేడుకలో పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ అందించారు. ముహూర్తపు షాట్‌లో భాగంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చిరుపై క్లాప్‌ కొట్టారు.

ఈ సినిమాలో చిరు సోదరి పాత్రలో కీర్తి సురేశ్‌ కనిపించనున్నారు. అలాగే మెగాస్టార్‌కు జోడీగా తమన్నా సందడి చేయనున్నారు. మణిశర్మ కుమారుడు మహతి సాగర్‌ స్వరాలు సమకూర్చనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.