చిరు కథ రవితేజకు వెళ్లిందా టాలీవుడ్ టాక్

చిరు కథ రవితేజకు వెళ్లిందా టాలీవుడ్ టాక్

0
87

దర్శకులు పలు కధలు హీరోలకి చెబుతూ ఉంటారు… కొందరు ఒకే చేస్తారు మరికొందరు ఇంకా మార్పులు కోరతారు… అయితే కొందరు దర్శకులు ఇలా కొన్ని కథలు వినిపిస్తూ ఉంటారు, అయితే తాజాగా టాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తోంది.

 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ మరోసారి నటించనున్నాడనేది ఆ వార్త. ఇప్పటికే వీరి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి, పూరి జగన్నాథ్ గతంలో చిరంజీవి కోసం ఆటో జానీ కథను రెడీ చేసుకుని వెళ్లి వినిపించారు, అయితే సెకండాఫ్ లో కాస్త మార్పులు చేయాలి అని చెప్పారు, మార్పులు చేసినా చిరంజీవి కాస్త అసంతృప్తిగా ఉన్నారనే టాక్ వచ్చింది.

 

ఈ సమయంలో ఈ స్టోరీ పూరి ప్రస్తుతం రవితేజకు వినిపించారట, ఆయన కాస్త మార్పులతో నాకు సెట్ అయ్యేలా రాయమని చెప్పారట, దీంతో ఆ స్టోరీ రవితేజ చేసే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ వార్త వైరల్ అవుతోంది.. వీరి కాంబోలో వచ్చిన ఇడియట్ అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే.