సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి యాక్టివ్ గా ఉన్నారు… చిరు ట్విట్టర్ లో కి లేటుగా ప్రవేశించినా కూడా ట్విట్టర్ వేదికగా ఆయన చేస్తున్న సందడి అంతా ఇంతాకాదు… తాజాగా డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై చిరంజీవి ట్వీట్ చేశారు…
చిరు ఏమని ట్వీట్ చేశారంటే… కరోనా ఎఫెక్ట్ తో పూరి జగన్నాథ్ బ్యాంక్, ముంబై బీచ్ లు చాలా మిస్ అవుతున్నాడని ట్వీట్ చేశాడు.. ఇక దీనిపై స్పందించిన పూరి… చిరంజీవి సార్ పెట్టిన ట్వీట్ తన కొంప ముంచిందని అన్నారు.
ఇలాంటి సమయంలో బ్యాంకాక్ గురించి ఎందుకు ట్వీట్ చేశారో కానీ మా ఆవిడ నా చెంప పగలగొట్టిందని చెప్పారు… చిరంజీవి సార్ ట్వీట్ చూసి గతంలో జరిగినవన్నీ మా ఆవిడకు గుర్తుకొచ్చాయని దానితో తనమీద చెయి చేసుకుందని ట్వీట్ చేశారు పూరి…