చిత్రం విడుదలైన తర్వాత దర్బార్ కు షాక్

చిత్రం విడుదలైన తర్వాత దర్బార్ కు షాక్

0
126

తమిళనాట తలైవా అభిమానులు ఈ సంక్రాంతికి చాలా సంతోషంలో ఉన్నారు.. దర్బార్ సినిమా రిలీజ్ కావడం సినిమా పాజిటీవ్ టాక్ సంపాదించడంతో చాలా ఆనందంలో ఉన్నారు , ఇప్పటికే వరల్డ్ వైడ్ సూపర్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విడుదలకు ముందే బోల్డంత హైప్ లభించింది. దీంతో భారీ వ్యాపారం జరిగింది,

అయితే తాజాగా ఈ సినిమాకు నిర్మాతలకు ఎలా ఉన్నా బయ్యర్లకు షాక్ తగిలింది.. విడుదలై కొన్ని గంటలైనా కాకముందే తమిళ్ రాకర్స్ భారీ షాకిచ్చారు. పైరసీ చేసి దర్బార్ సినిమా మొత్తాన్ని ఆన్లైన్లో లీక్ చేశారు. అయితే ఈ చిత్రం విడుదల అయిన మొదటి షో నుంచి ఈ సినిమా ఆన్ లైన్ లో లీక్ అయింది.

ఇక రెండోవ షో స్టార్ట్ చేసే సమయానికి ఈ చిత్రం ఆన్ లైన్ లో కనిపించడం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు, అయితే ఈ మధ్య ఏ సినిమా అయినా, బాషతో సంబంధం లేకుండా అన్నీ తమిళ రాకర్స లో కనిపిస్తున్నాయి.. దీంతో తలైవా అభిమానులు రగిలిపోతున్నారు, సైబర్ పోలీసులు ఈ లింక్స్ తీసే పనిలో ఉన్నారు.