సౌందర్య క్యారెక్టర్ గురించి ఆర్టిస్ట్ వెంకట్ రెడ్డి సంచలన విషయాలు

0
93

దివంగత సినీ నటి, అందాల తార సౌందర్య మరణించినా దక్షిణాది ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. దక్షిణాదిలో సావిత్రి తర్వాత అంతటి స్థానాన్ని ఆక్రమించిన అగ్రనటిగా పేరు తెచ్చుకున్నారు సౌందర్య. ఆమె సినిమాలు చూసిన వారు ఇప్పటికీ సౌందర్య నటనా గొప్పతనాన్నిగుర్తు చేసుకుంటూనే ఉంటారు. సౌందర్య తెలుగు, తమిళ, మలయాలం, కన్నడ లాంటి దక్షిణాది సినిమాల్లోనే కాకుండా బాలీవుడ్ లోనూ నటించి మెప్పించింది. దక్షిణాది అగ్రశ్రేణి కథానాయకులతో పోటీ పడి నటించి మెప్పించింది. అమితాబ్ బచ్చన్ తో కూడా నటించి బాలీవుడ్ లో గొప్ప పేరు తెచ్చుకుంది.

సినీ నటి సౌందర్య గురించి సెట్స్ లో ఆమె వ్యవహరించే తీరు గురించి ఆర్టిస్ట్ వెంకట్ రెడ్డి తన అభిప్రాయాలను Shadow Tv అనే యూట్యూబ్ చానెల్ తో పంచుకున్నారు. సౌందర్య గొప్పదనాన్ని ఎంత చెప్పినా తక్కువే అని వెంకట్ రెడ్డి వెల్లడించారు. వెంకట్ రెడ్డి అనేక తెలుగు సినిమాలలో నటించారు. ఆయన హైదరాబాద్ వాసి.

వెంకట్ రెడ్డి వీడియోలో సౌందర్య గురించి ఏం చెప్పారో పైన వీడియో లింక్ ఉంది చూడొచ్చు…