Samantha: సమంతకు వెల్లువెత్తిన పరామర్శలు

-

Samantha: సమంత త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్‌ వేదికగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా సమంతకు అండగా ఉంటామంటూ పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో తాను బాధపడుతున్నానంటూ, సమంత ప్రకటించిన విషయం తెలిసిందే. చికిత్స తీసుకుంటున్న చిత్రాన్ని ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.
సమంతకు అండగా నిలుస్తున్నట్లు మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

- Advertisement -

‘‘డియర్‌ సామ్‌, కాలానుగుణంగా మన జీవితాల్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటివల్ల మనకు ఎంత శక్తి, సామర్థ్యాలు ఉన్నాయో తెలుస్తాయి. మనోబలం కలిగిన అద్భుతమైన అమ్మాయివి నువ్వు.. అతి త్వరలోనే నువ్వు ఈ సమస్యను అధిగమిస్తావనే నమ్మకం నాకు ఉంది అంటూ చిరంజీవి సమంతకు ధైర్యం చెప్పారు.’’

‘‘త్వరగా కోలుకోవాలి.. మీకు ఆ ధైర్యాన్ని పంపుతున్నా అంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. మీరు ఎప్పటిలాగే బలంగా తిరిగి పుంజుకోవటానికి ఎక్కువ సమయం తీసుకోరు అని నేచురల్‌ స్టార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కైరా అద్వానీ, కాజల్‌ అగర్వాల్‌, రాహుల్‌ రవీంద్రన్‌ తదితరులు త్వరగా కోలుకోవాలంటూ’’ ట్వీట్‌ చేశారు.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత, గత కొద్దిరోజులుగా ఎటువంటి పోస్టులు చేయకపోవటంతో.. ఆమె ఆరోగ్యంపై రకరకాల రూమర్లు చక్కర్లు కొట్టాయి. సమంత(Samantha)ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుందనీ.. అది వికటించటంతోనే కెమెరా ముందుకు రావటం లేదనీ, ఇలా పలు వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తాజాగా సమంత చేసిన ట్వీట్‌తో అందరికీ స్పష్టత వచ్చింది. మయోసైటిస్‌ సోకిన వారు కండరాల బలహీనతతో పాటు.. ఎక్కువ సేపు కూర్చోలేరు. మన అభిమాన నటి త్వరలోనే కోలుకొని, ఆరోగ్యంగా మళ్లీ మనందర్నీ పలకరించాలని మనం కూడా ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...