సినీ కార్మికులకి భారీ సాయం ప్రకటించిన సల్మాన్ ఖాన్

సినీ కార్మికులకి భారీ సాయం ప్రకటించిన సల్మాన్ ఖాన్

0
102

కరోనా సమయంలో అన్నీ రంగాలు దెబ్బతిన్నాయి, అత్యంత దారుణమైన పరిస్దితిలో ఉన్నాయి, ముఖ్యంగా సినిమా పరిశ్రమ చాలా నష్టాల్లో ఉంది.. ఏడాదిగా దారుణమైన స్దితిలో ఉంది. ఇక సినిమా పరిశ్రమకు చెందిన నటీ నటులు కొందరు సినీ కార్మికులు ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

 

సినీ కార్మికులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ … సినిమా పరిశ్రమలోని 25 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1500 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటికే సల్మాన్ టీమ్ కార్మికుల బ్యాంకు ఖాతాల వివరాలను కోరారు.

 

సల్మాన్ బృందం విజ్ఞప్తికి స్పందించిన సినీ కార్మికుల సమాఖ్య తమ వద్ద పేర్లు నమోదు చేయించుకున్న కార్మికుల బ్యాంకు ఖాతాల వివరాలను అందించింది.. బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ద్వారా సల్మాన్ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.