సినిమా అవకాశం ఇప్పిస్తానని చెప్పి యువతిని….

సినిమా అవకాశం ఇప్పిస్తానని చెప్పి యువతిని....

0
81

ఒక యువతి సినిమాలో నటించాలని, స్క్రీన్ మీద తనను తాను చూసుకోవాలని ఎంతో ఆశపడేది… చాలా కాలంగా జూనియర్ ఆర్టిస్ట్ అవకాశాల కోసం అనేక ప్రయత్నాలు చేసింది… ఇక ఈ విషయాన్ని గమనించిన స్థానిక గీతాలయ స్టూయోస్ కు చెందిన గీతా ప్రసాద్ తో పాటు మరికొందరు సదరు యువతికి మాయమాటలు చెప్పి నమ్మించారు…

సినిమా ఇండస్ట్రీలో తమకు అనేక మందితోపరిచయాలు ఉన్నాయని ఓ ప్రముఖ సినిమాలో స్పెషల్ సాంగ్ లో అవకాశం ఇప్పిస్తామని అంతేకాదు 10 లక్షల పారితోషకం ఇప్పిస్తామని నమ్మించారు… అయితే ఇందుకు తమకు ఐదు లక్షలు కమీషన్ ఇవ్వాలని చెప్పారు… దీంతో ఆ యువతి ముందుగానే అతడిని నమ్మి ఐదు లక్షలు చేతిలో పెట్టింది…

ఆతర్వాత గీతా ప్రసాద్ ముఖం చాటేశాడు… ఇటీవలే ఆయన్ను యువతి నిలదీయండంతో ఆమెను బెధిరించాడు… దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది… పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది…