సినిమా పరిశ్రమ వారికి రెండు చోట్ల రిసెప్షన్లు ఏర్పాటు చేస్తున్న కాజల్ ఎక్కడంటే

సినిమా పరిశ్రమ వారికి రెండు చోట్ల రిసెప్షన్లు ఏర్పాటు చేస్తున్న కాజల్ ఎక్కడంటే

0
107

గత నెలలో తన మిత్రుడు అయిన గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుంది చందమామ కాజల్ అగర్వాల్.. ఈ పెళ్లి ముంబైలో కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య జరిగింది, అయితే ఇక వారిద్దరూ కలిసి హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు, ఆమె సౌత్ ఇండియాలో పెద్ద స్టార్ హీరోయిన్. అయితే ఆమె పెళ్లికి టాలీవుడ్ కోలీవుడ్ నుంచి పెద్దగా ఎవరూ హాజరు కాలేదు.

అందుకే ఆమె తాజాగా సినిమా పరిశ్రమ వారికి రిసెప్షన్ ఏర్పాటు చేసి పార్టీ ఇవ్వనుంది అని తెలుస్తోంది,
త్వరలో రెండు చోట్ల రిసెప్షన్లను ఏర్పాటు చేయబోతోందని, ఆ ప్లేస్ లు కూడా ఫిక్స్ చేసింది అని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్, చెన్నైలో భారీగా విందు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోందట.

టాలీవుడ్, కోలీవుడ్ సినీ స్టార్స్ అందరినీ ఆహ్వానించనుందట. అయితే ఎక్కడ ఎప్పుడు అనేది త్వరలో వెల్లడించనున్నారు, ఈ వేడుకకి టాలీవుడ్ కోలీవుడ్ లో తనతో నటించిన వారికి తన మిత్రులని పిలవనుంది అందాల చందమామ కాజల్.