సినిమాకోసం ప్రత్యేకంగా అది నేర్చుకుంటున్న బన్నీ

సినిమాకోసం ప్రత్యేకంగా అది నేర్చుకుంటున్న బన్నీ

0
97

అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ సినిమాతో బిజీగా ఉన్నారు.. శేషాచలం అడవుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుంది, ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి చాలా వరకూ మెయిన్ షూటింగ్ సీన్లు ప్లాన్ చేశారు, పదిరోజులుగా బన్నీ కూడా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి, అయితే దీని గురించి ఇంకా ఎక్కడా బయటకు విషయం రివీల్ కాలేదు.. అందుకే అభిమానులు కూడా సరైన అప్ డేట్ వచ్చే వరకూ ఆగాలి అని చూస్తున్నారు.

కాని తాజాగా ఈ సినిమా గురించి బన్నీ గురించి ఓ అప్ డేట్ అయితే వచ్చింది. కొన్ని రోజులుగా అల్లు అర్జున్ లారీ డ్రైవింగులో శిక్షణ తీసుకుంటున్నట్టుగా ఒక వార్త బయటికి వచ్చింది. దాంతో ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించేది నిజమేనని తెలుస్తోంది. బీడీ తాగుతూ .. లుంగీ పైకి కట్టి .. పూర్తి మాస్ లుక్ తో చిత్తూరు యాసలో మాట్లాడుతూ ఉంటాడట. ఇందులో రష్మిక హీరోయిన్ అంతేకాదు జగపతిబాబు కూడా కీలక పాత్ర చేస్తున్నారు పక్కా మాస్ యాంగిల్ లో సినిమా ఉంటుంది అని అంటున్నారు.