సినిమా ప‌రిశ్ర‌మ‌లో మరో విషాదం ప్రముఖ కొరియోగ్రాఫర్ మృతి

సినిమా ప‌రిశ్ర‌మ‌లో మరో విషాదం ప్రముఖ కొరియోగ్రాఫర్ మృతి

0
92

సినిమా ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస విషాద సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి, కోలుకోలేని షాక్ కి గురి చేస్తున్నాయి, ఇటీవల రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణించారు, ఈ ఘ‌ట‌న‌ల నుంచి కోలుకోక ముందే మ‌రో దారుణం జ‌రిగింది.

బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ మృతి చెందారు. 71 ఏళ్ల సరోజ్ ఖాన్ గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. ఈ వార్త తెలియ‌గానే బీ టౌన్ శోక‌సంద్రంలో మునిగింది. ఆమె కొద్ది రోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.

ఒంట్లో బాగాలేక‌పోవ‌డంతో ఆమెని బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం కన్నుమూశారు. ఆమె40 ఏళ్ల సినిమా కెరియర్ లో బాలీవుడ్ లో అంద‌రికి కొరియోగ్ర‌ఫీ చేశారు.. మొత్తం 2000కి పైగా సినిమాలు చేశారు. శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌ల వంటి స్టార్స్‌కి డ్యాన్స్ నేర్పించారు. ఆమె మ‌ర‌ణంతో సంతాపం తెలిపారు బీ టౌన్ పెద్ద‌లు.