సినిమా పరిశ్రమలో విషాదం యువ నటుడు మృతి

సినిమా పరిశ్రమలో విషాదం యువ నటుడు మృతి

0
107

చిత్ర పరిశ్రమలో వరుసగా విషాద చాయలు అలముకున్నాయి, ఈ వైరస్ వేళ అందరూ ఇంటిలో ఉండే సమయం ..కాని ఇప్పుడు చిత్ర పరిశ్రమలో విషాద వార్తలు వింటున్నారు, ఇది కలిచివేస్తోంది.
నిన్న సీనియర్ నటి వాణి శ్రీ కుమారుడు అభినయ్ వెంకటేశ్ కార్తీక్, మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ మరణించారనే వార్త నుంచి ఇంకా ఎవరూ బయటకు రాలేదు..

కాని ఈ సమయంలోనే మరో నటుడు మరణించారు.. ఇది బీటౌన్ ని షాక్ కి గురిచేసింది..యువ నటుడు మోహిత్ బఘేల్ కన్నుమూశారు. ఆయన వయసు 26, ఆయనకు క్యాన్సర్ సోకింది చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఉత్తరప్రదేశ్లోని మథురలో మరణించినట్టు రచయిత, దర్శకుడు రాజ్ శాండిల్య పేర్కొనడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పలువురు సంతాపం తెలిపారు..రియాలిటీ షో చోటే మియాన్తో కెరీర్ ఆరంభించారు మోహిత్ బఘేల్. తర్వాత రెడీ సినిమాలో నటించారు, ఇక తర్వాత సిద్దార్థ్ మల్హోత్రా, పరిణితీ చోప్రా జంటగా నటించిన జబారియా జోడి లో కూడా ఆయన నటించారు.