సినిమా షూటింగులో స్టార్ హీరోకు ప్రమాదం

సినిమా షూటింగులో స్టార్ హీరోకు ప్రమాదం

0
107

సినిమా షూటింగులు జరిగే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు చిన్న ఇబ్బంది కూడా హీరో హీరోలని మిగిలిన నటులకి రాకుండా ప్రొడక్షన్ వారు అన్నీ చూస్తారు ..అయినా కొన్ని కొన్ని అనుకోని కారణాల వల్ల సమస్యలు వస్తాయి .ప్రమాదాలు జరుగుతాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ షూటింగులో గాయపడ్డారు. దీంతో బీటౌన్ లో ఇది పెద్ద చర్చకు కారణం అయింది, ఆయనకు ఏమైంది అని అందరూ కంగారుపడ్డారు.

జెర్సీ సినిమా షూటింగ్ సందర్భంగా హీరో షాహిద్ కపూర్ క్రికెట్ ఆడుతున్నపుడు బంతి ఊహించని విధంగా వచ్చి ముఖానికి తగిలి దిగువ పెదవిపై తీవ్ర గాయమైంది. షాహిద్ కపూర్ పెదవి చిట్లి రక్తం రావడంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. డాక్టరు అతని పెదవికి కుట్లు వేశారు. పెదవిపై అయిన గాయం నయం అవడంతోపాటు వాపు తగ్గే వరకూ నాలుగైదు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు షాహిద్కు సూచించారు.

దీంతో ఫుల్ జోష్ లో సాగుతునన షూటింగుకి బ్రేకులు వేశారు. ఐదు రోజుల పాటు నిలిపివేశారు. తెలుగులో హిట్ అయిన జెర్సీ సినిమాను హిందీ వెర్షన్లో అదే పేరుతో షాహిద్ హీరోగా నిర్మిస్తున్నారు. జెర్సీ హిందీ వెర్షన్కు గౌతమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ వెర్షన్ లో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ఈ హిందీ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అమన్ గిల్, దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆయనకు ఏమీ కాలేదు అని కంగారుపడాల్సిన పనిలేదు అని అభిమానులకి చిత్ర యూనిట్ తెలిపింది