సినిమాలపై విజయశాంతి సంచలన నిర్ణయం

సినిమాలపై విజయశాంతి సంచలన నిర్ణయం

0
91

లేడీ అమితాబ్ గా పేరు సంపాదించారు విజయశాంతి, ఆమె దాదాపు 40 సంవత్సరాలుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు.. కాని గత పది సంవత్సరాలుగా రాజకీయాల్లో బిజీగా ఉండి ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు.. తాజాగా మహేష్ బాబు చిత్రం సరిలేరునీకెవ్వరు చిత్రంలో కీలక రోల్ చేశారు, అయితే ఆమె వరుసగా సినిమాలు చేస్తారు అని అందరూ అనుకున్నారు. ఈ సమయంలో ఆమె పెట్టిన ట్వీట్ సంచలనం అయింది.

సరిలేరు నీకెవ్వరు ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించి, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు చెబుతున్నాను, నా నట ప్రస్ధానానికి 1979 కళ్ళుకుల్ ఇరమ్,కిలాడి కృష్ణుడు నుండి నేటి 2020 సరిలేరునీకెవ్వరు వరకు ఆగౌరవాన్ని అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు అని విజయశాంతి తెలిపారు.

ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం… మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి ఇక శెలవు…మనసు నిండిన మీ ఆదరణకు,…నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి …ఎప్పటికీ నమస్సులు..మీ విజయశాంతి అంటూ ట్వీట్ పెట్టారు.