టాలీవుడ్ లో చాలా మంది హీరోలు వారసులుగా సినిమాలు చేస్తూ మంచి ఫామ్ లో ఉన్నారు, వాస్తవంగా చెబితే ఇండస్ట్ట్రీలో ఇద్దరు ముగ్గురు హీరోలు మినహా మిగిలిన వారు అందరూ సినీ హీరోల వారసులే.. ఇటు నిర్మాతలుగా హీరోలుగా చేస్తున్నారు, ఇక తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంటి నుంచి కూడా వారసుడు వస్తున్నాడు.
దిల్ రాజు ఆయన సోదరుడు శిరీష్ తనయుడు ఆశీష్ రెడ్డిని హీరోగా పరిచయం చేయబోతున్నారు.. ఈ సినిమా కోసం మంచి కథని కూడా ఆయన రాయించి లాక్ చేయించారు, ఇప్పటికే చిత్రం పనులు జరుగుతున్నాయి.ఈ సినిమా కోసం ప్రత్యేకంగా పలుకే బంగారమాయె అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు.
హుషారు సినిమా దర్శకుడు శ్రీహర్ష కొనెగంటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక పెద్ద ఆర్బాటాలు లేకుండా ఈ సినిమా గత ఏడాది దసరా సమయంలో ఓపెనింగ్ చేశారు.. అప్పటి నుంచి షూటింగ్ జరుగుతోంది, ఇక సమ్మర్ లో దిల్ రాజు ఈ సినిమాని తీసుకువస్తున్నారు, అన్నీ దియేటర్లలో ఈ చిత్రం మంచి మార్కెట్ చేసి విడుదల చేయాలి అని చూస్తున్నారు.