పాన్ ఇండియా స్టార్ గా హీరో సూర్యకు గుర్తింపు ఉంది, యాక్షన్ కామెడీ ఫ్యామిలీ ఏ జోనర్ అయినా ఆయన అద్బుతంగా నటిస్తారు,హీరో సూర్య కోలీవుడ్ నటుడే అయినప్పటికీ టాలీవుడ్ హీరోలకు సమానంగా ఇక్కడ అభిమానులను సంపాదించుకున్నారు. ఇక తెలుగులో ఆయనకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు.
ఇటు ఫ్యామిలీకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన, ముఖ్యంగా సినిమాల్లోకి రాకముందు ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు కుటుంబానికి ఆర్దిక ఇబ్బందులు ఉండేవి, ఆయన చిత్రాలు చేయక ముందు ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేశారు.. సడన్గా సినీ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అంటే, ఈ సమయంలో డబ్బు కోసమే ఆయన వచ్చారు అని చెబుతారు.
కుటుంబం తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉంది. అప్పుగా తీసుకున్న రూ.25వేలను తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్నాం. ఇంటికి పెద్ద కొడుకుగా నా తండ్రికి సాయం చేయాలనుకున్నా. అందుకే సినిమా పరిశ్రమలో అడుగుపెట్టా తొలిసినిమా చేసిన వెంటనే 50 వేలు ఇచ్చారు, అప్పు తీర్చి నాన్నకు డబ్బులు ఇచ్చాను అని తెలిపారు సూర్య.
1995లో వసంత్ తీసిన ఆశ మూవీలో హీరోగా సూర్యకు అవకాశం వచ్చింది అది చేయలేదు..ఆ తరువాత 1997లో మణిరత్నం నిర్మించిన నెర్రుక్కు నెర్ ద్వారా సూర్య హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అద్బుతమైన చిత్రాలతో సౌత్ ఇండియన్ స్టార్ హీరోగా ఆయన వెలుగొందుతున్నారు.