సినిమాలు చేయ‌డం పై హీరోయిన్ ఛార్మి సంచ‌ల‌న నిర్ణ‌యం

సినిమాలు చేయ‌డం పై హీరోయిన్ ఛార్మి సంచ‌ల‌న నిర్ణ‌యం

0
93

ఛార్మి టాలీవుడ్ లో అంద‌మైన హీరోయిన్ల‌లో ఆమె కూడా ఒక‌రు. అంద‌రు అగ్ర‌హీరోల‌తో ఆమె సినిమాల్లో న‌టించారు, అయితే కొన్ని ఏళ్లుగా ఆమె సినిమాల్లో న‌టించ‌డం లేదు, ఇక టాలీవుడ్ లో ఆమె స‌రికొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు, ఇటీవ‌ల‌ నిర్మాత‌గా మారారు.

అయితే సినిమా ప‌రిశ్ర‌మ‌కు చాలా మంది కొత్త హీరోయిన్లు వ‌స్తున్నార‌ని, టాలెంట్ ఉన్న వారు చాలా మంది ఇప్పుడు వ‌స్తున్నారు అని అన్నారు ఛార్మీ, ఇక‌పై తాను హీరోయిన్ గా న‌టించ‌డం లేదు అని క్లారిటీ ఇచ్చింది. వాస్తవానికి జ్యోతిలక్ష్మి సినిమా సమయంలోనే నటిగా రిటైర్ అవుదామని భావించానని… అయితే పూరి జగన్నాథ్, కల్యాణ్ సలహాతో ఆ విషయాన్ని ప్రకటించలేదని చెప్పింది.

ఇక ఛార్మి ఫుల్ బిజీగా మారింది సినిమా నిర్మాణంలో, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీతో క‌లిసి సినిమాలు చేస్తున్నారు ఆమె, ఇటీవ‌ల సూప‌ర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా సినిమాను నిర్మిస్తోంది, ఇక ఛార్మి సినిమాలు చేయ‌ను అని చెప్ప‌డంతో ఆమె అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నారు.