మెగా ఫ్యామిలీలో ఆస్తుల అలజడి? అసలు నిజం ఇదే!

-

Clarity on Property fight in megastar Chiranjeevi family: మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మెగా అభిమానులను సైతం ఈ వార్త కలవరపెడుతోంది. కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయని, చిరంజీవిపై కూతుర్లు సుష్మిత, శ్రీజ కోపంగా ఉన్నారన్నది ఈ వార్తల సారాంశం. ఇంతకీ వారింట్లో ఆస్తి గొడవలు మొదలయ్యాయా? ఈ వార్తల్లో వాస్తవం దాగి ఉందా? చిరంజీవిపై కూతుర్లు నిజంగానే కోపంగా ఉన్నారా? ఈ వార్తలు నిజమా? కాదా? ఇప్పుడే తెలుసుకుందాం.

- Advertisement -

మెగా ఫ్యామిలీ, వారి అభిమానులు ఎప్పటి నుండో మెగా వారసుల కోసం ఎదురు చూస్తున్నారు. రామ్-చరణ్ ఉపాసనల పెళ్ళై దాదాపు పదేళ్లు దాటిన తర్వాత వారు తల్లిదండ్రులు కాబోతున్నారనే శుభవార్తని అనౌన్స్ చేసింది. అయితే ఈ వార్త వచ్చీ రాగానే మరో షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. చిరంజీవి తన ఆస్తి మొత్తం రామ్ చరణ్ కొడుకే చెందుతుందని వీలునామా రాశారట. కూతుర్లకు పెళ్లి సమయంలోనే ఇవ్వవలసినవన్నీ ఇచ్చేశాడట. అందుకే మిగిలిన తన ఆస్తిని తన తదనంతరం వారసుడికే చెందేలా వీలునామా రాయడంతో కూతుర్లు ఇద్దరూ హర్ట్ అయ్యారట. తండ్రి మీద పట్టరాని కోపంతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ వార్త దృష్టికి రాగానే alltimereport చిరంజీవి ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండేవారిని సంప్రదించింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చిరంజీవి సన్నిహితులు ఒకరు తెలిపారు. వారి కుటుంబంలో ఆస్తి పంపకాలకు సంబంధించిన సమస్యలేవీ లేవని, కూతుర్లు చిరంజీవిపై అలిగారనే వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రచారం జరుగుతున్న వార్తల్లో వారసుడి పేరు మీద వీలు రాసినట్టు ఉంది. రామ్ చరణ్ దంపతులకి పుట్టేది మగబిడ్డా లేక ఆడబిడ్డా అనేది ఇంకా వారికే తెలియదు. అసత్య ప్రచారం చేసేవారికి ముందే ఎలా తెలిసింది అంటూ మండిపడ్డారు. దయచేసి ఇలాంటి వార్తలని నమ్మొద్దని, గుడ్డిగా వాటిని ప్రచారం చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.

Read Also: బ్రా, జాకెట్ విప్పేసి అందాలు ఆరబోసిన బ్యూటీ (వీడియో)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...