రజనీ vs సూర్య.. చిచ్చు పెట్టిన రిలీజ్ డేట్

-

Rajinikanth – Suriya | సినిమా ఇండస్ట్రీలో ఉండే అతిపెద్ద సమస్య రిలీజ్ డేట్స్. ఒక హీరో మరో హీరోకి క్లాషెస్ వచ్చేది. ఫ్యాన్ వార్స్ స్టార్ట్ అయ్యేది కూడా ఈ పాయింట్‌లోనే. అందుకే బడా హీరోలు అందరూ కూడా తమ సినిమాల రిలీజ్ డేట్స్‌ను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఫిక్స్ చేసుకుంటుంటారు. అప్పటికి కూడా కొన్నికొన్ని సందర్భాల్లో చిన్నచిన్న క్లాషెస్ వచ్చినా ఎవరో ఒకరు సర్దుకుపోతుంటారు. మరికొందరు మాత్రం తగ్గేదేలేదంటూ అదే డేట్‌కు సినిమాను రిలీజ్ చేసి హిట్టో, ఫట్టో మూటగట్టుకుంటారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితే ఇద్దరు స్టార్ హీరోల మధ్య నెలకొంది. వారిలో ఒకరు సూపర్ స్టార్ రజినీ కాంత్ కాగా మరో హీరో సూర్య. వీరిద్దరికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీరిలో ఒక్కరి సినిమా వస్తుంటేనే తమిళనాట అంతా కూడా పండగలా మారుతుంది. అలాంటిది ఇద్దరు సినిమాలు.. అది కూడా ఒకే రోజు అంటే.. ఇక పెద్ద జాతరలా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇదే తమిళనాడులో పెద్ద యుద్ధంలాంటి వాతావరణాన్ని తీసుకొచ్చింది. మా హీరోతో పోటీ పడే మొనగాడా మీ హీరో అంటూ ఇద్దరు హీరోల అభిమానులు కొట్టుకుచస్తున్నారు. అసలు విషయం ఏంటంటే..

- Advertisement -

రజినీ కాంత్ ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్(Vettaiyan)’ చేస్తున్నాడు. మరోవైపు సూర్య.. సరుతైశివ దర్శకత్వంలో ‘కంగువ(Kanguva)’ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపైనా తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా అక్టోబర్ 10న రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. ఈ మేరకు మూవీ మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించేశారు. దీంతో ఫ్యాన్ వార్‌ మొదలైంది. ముందుగా ‘కంగువ’ డేట్ రిలీజ్ అయిందని, ఆ తర్వాత రజనీ కాంతే(Rajinikanth) కావాలని పోటీ వస్తున్నారంటూ సూర్య ఫ్యాన్స్ ఫైరయిపోతున్నారు. ఇంత గందరగోళం స్టార్ట్ అవడంతో తామే వెనక్కి తగ్గుదాం అన్న ఆలోచనలో ‘కంగువ’ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తమ సినిమా రిలీజ్‌ను అక్టోబర్ 31కి వాయిదా వేసుకుందామా అన్న అంశంపై మూవీ టీమ్‌తో చర్చలు చేస్తున్నారు. కానీ అక్టోబర్ 31న హీరో శివకార్తికేయన్ నటిస్తున్న ‘అమరాన్(Amaran)’ సినిమా రిలీజ్ ఉండటంతో ప్రస్తుతం రిలీజ్ డేట్ విషయంలో ‘కంగువ’ మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. మరి ఈ విషయంలో ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read Also: నేను పబ్లిక్ ప్రాపర్టీని కాదు: తాప్సీ ఫైర్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mahesh Kumar Goud | ‘అదానీ అరెస్ట్ అయితే.. మోదీ రాజీనామా తప్పదు’

అదానీ అరెస్ట్ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar...

KTR | ‘కెన్యాకు ఉన్న ధైర్యం రేవంత్‌కు లేదా?’

అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్...