చిత్ర పరిశ్రమకు సీఎం జగన్ గుడ్ న్యూస్

-

ఈ లాక్ డౌన్ సమయంలో చిత్ర పరిశ్రమ అత్యంత దారుణమైన పరిస్దితిని చూసింది, దాదాపు 8నెలలుగా సినిమా ధియేటర్లు తెరచుకోలేదు , దీంతో చిత్ర పరిశ్రమపై ఆధారపడిన చాలా మంది దారుణమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఓ పక్క థియేటర్లు ఓపెన్ కాలేదు, దీంతో పనిచేసే వేలాది మంది కార్మికులు ఇబ్బంది పడ్డారు.

- Advertisement -

తాజాగా నేడు జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు…3 నెలల పాటు సినిమా హాళ్లు చెల్లించాల్సిన ఫిక్స్ డ్ విద్యుత్ చార్జీలను రద్దు చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఇది వర్తిస్తుంది, ఇక దాదాపు నెలకి మూడు కోట్లు ఈ చార్జీలు సర్కారు భర్తిస్తుంది.

ఇక తర్వాత ఆరు నెలల ఫిక్సిడ్ చార్జీలు ప్రస్తుతం చెల్లించక్కర్లేదు..వాయిదా వేశారు…రీస్టార్ట్ ప్యాకేజిలో భాగంగా రాష్ట్రంలో ఉన్న థియేటర్లకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, ఏ, బీ సెంటర్లలోని థియేటర్లకు రూ.10 లక్షలు, సీ సెంటర్లలో ఉన్న థియేటర్లకు రూ.5 లక్షల చొప్పున రుణాలు ఇస్తారు, దీనిపై ఆరు నెలల మారిటోరియం కూడా అమలు చేస్తారు, ఈ నిర్ణయంతో చిత్ర సీమ ప్రముఖులు అందరూ కూడా ఎంతో మంచి నిర్ణయం అని అభినందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...