కాఫీతోటల్లో బిజీ బిజీగా రాజమౌళి ప్లాన్ ఏమిటి

కాఫీతోటల్లో బిజీ బిజీగా రాజమౌళి ప్లాన్ ఏమిటి

0
93

ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ క్లైమాక్స్ కు వచ్చేసింది అదేంటి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా కాదు తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ సీన్ షూట్ చేస్తున్నారు చిత్ర యూనిట్.. రాజమౌళి టీం మొత్తం ఈ షూట్ కోసం మన్యం వచ్చారు.. అదేనండి విశాఖ జిల్లా అక్కడ ఆరు రోజులు చిత్ర షూటింగ్ జరుపుకుంటోంది.

ఆరు రోజుల పాటు కాఫీ తోటల్లో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ.. విశాఖ పాడేరు మండలంలో మోదాపల్లి, డల్లాపల్లి ప్రాంతాల్లోని కాఫీ తోటల్లో ఆరు రోజుల పాటు సినిమాకు సంబంధించిన క్తైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దర్శకుడు రాజమౌళి సోమవారం కాఫీ తోటలను పరిశీలించి, మంగళవారం నుంచి సీన్లను అసిస్టెంట్ డైరెక్టర్లకు వివరించారు.

మొత్తం ఆరు రోజులు ఇక్కడ షూటింగ్ జరుగుతుంది.. అయితే మెయిన్ గా ఇక్కడ తారక్ కు సంబంధించిన సన్నివేశాలు షూటింగ్ జరుగుతాయి అని తెలుస్తోంది అయితే ఆయన టీమ్ కు ఇక్కడ ప్రాంతం బాగా నచ్చింది. పలు సన్నివేశాలకు ఇక్కడ పర్ఫెక్ట్ అని జక్కన్న ఫీల్ అయి ఇక్కడకు వచ్చారట.