జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పురస్కారాల్లో.. తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్‌ఫోటో ఎంపికైంది. ఉత్తమ సంగీతచిత్రంగా అల వైకుంఠపురములో నిలిచాయి. ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ ఎంపికయ్యారు. ఉత్తమ కొరియోగ్రఫీ చిత్రంగా నాట్యం ఎంపికైంది. కలర్ ఫోటో చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా గీత ఆర్ట్స్ కార్యాలయంలో చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో దర్శకుడు వంశీ పైడి పల్లి, చిత్ర యూనిట్ పాల్గొంది.అహా ప్రతినిధి వాసు మాట్లాడుతూ.. “ఇది అందరికీ గర్వ పడే విషయం..అరవింద్ గారు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చెయ్యాలి అని అహా ని స్టార్ట్ చేశారు. మంచి కంటెంట్ తో వచ్చిన కలర్ ఫోటో అందరినీ ఆకట్టుకుంది”అని ఈ సందర్భంగా తెలియజేసారు.
దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ తరువాత ఆహాలో రిలీజ్ అయ్యింది. చిన్న చిన్న ఊర్లలో కూడా అహా వల్ల అందరికీ రిచ్ అయ్యింది. జన్యు న్ గా తీస్తే అందరికీ నచ్చుతుందని ఈ సినిమా ప్రుబ్ చేసింది” అన్నారు.
హిరో సుహాస్ మాట్లాడుతూ.. “ఫస్ట్ రాజేష్ అన్న నువ్వు హిరో గా చెయ్యాలి అన్నప్పుడు భయం వేసింది..మంచి సినిమా అవార్డ్ రావడం చాలా హ్యాపీగా వుంది”. అన్నారు.
చాందినీ చౌదరి మాట్లాడుతూ.. “ఈ సినిమా నేషనల్ లెవెల్ లో రికగ్నైజ్ అయినందుకు చాలా సంతోషంగా వుంది.నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్.నా కెరీర్ లో గుర్తిండిపోయే సినిమా కలర్ ఫోటో”.అని అన్నారు.
దివ్య మాట్లాడుతూ.. “నేను ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను..చాలా హ్యాపీగా ఉంది.ప్రతి డిపార్ట్మెంట్ కి థాంక్స్..ప్రతి సినిమాకు అందరూ హార్డ్ వర్క్ చేస్తారు..కొంతమంది ఇష్ట పడి పని చేస్తారు”. అన్నారు.
వైవ హర్ష మాట్లాడుతూ.. “ఈ సినిమా చేస్తున్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్ లు హానేస్ట్ గా కృషి చేసారు..అహా లో మంచి మంచి కంటెంట్ వుంది అక్రాస్ ఇండియా అహా వల్ల రిచ్ అయ్యిందని అన్నారు.