కలర్స్ స్వాతి తో నిఖిల్ సినిమా – హీరోయిన్ కాదట

కలర్స్ స్వాతి తో నిఖిల్ సినిమా - హీరోయిన్ కాదట

0
115

కలర్స్ స్వాతి యాంకర్ గా తన షో పేరునే తన పేరుగా మార్చేసుకుంది… అలా సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది స్వాతి,
స్వామిరారా- కార్తికేయ చిత్రాల్లో యువహీరో నిఖిల్ కి జోడీగా కలర్స్ స్వాతి నటించింది. మొత్తానికి ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గర అయింది స్వాతి, అయితే ఆమె వివాహం చేసుకుని సినిమాలకు దూరంగా ఉన్నారు.

కాని తాజాగా ఆమె ఓ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుంటున్నారట.. అయితే ఆ సినిమా హీరో నిఖిల్ ది అని తెలుస్తోంది. నిఖిల్ మరోసారి ఎక్స్ కొలీగ్ కి ఆఫర్ ఇస్తున్నాడని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.. నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ సీక్వెల్ లో నటించేందుకు రెడీ అవుతున్నారు. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కలర్స్ స్వాతి హీరోయిన్ గా తీసుకోవాలి అని నిఖిల్ చెప్పారట.

అయితే తను రీ ఎంట్రీ ఇవ్వడానికి ఎస్ చెప్పారు అని తెలుస్తోంది.. అయితే స్వాతి ఇందులో హీరోయిన్ గా కనిపించరట. సినిమాలోకి కీలక సన్నివేశాల్లో న్యూస్ రిపోర్టర్ గా కనిపిస్తుందట. మిస్టీరియస్ టెంపుల్స్ నేపథ్యంలో ఆసక్తికర కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ ని చిత్ర బృందం ఇప్పటికే ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆమె ఈ రిపోర్టర్ పాత్రకు ఒకే చెప్పారు అని తెలుస్తోంది, మరి సెకండ్ హీరోయిన్ గా స్వాతి సినిమా చేస్తుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.