కలర్ ఫొటో డైరెక్టర్ తో స్టార్ హీరో సినిమా – టాలీవుడ్ టాక్

కలర్ ఫొటో డైరెక్టర్ తో స్టార్ హీరో సినిమా - టాలీవుడ్ టాక్

0
85

ఒక్క మీడియం బడ్జెట్ చిన్న బడ్జెట్ సినిమా తీసినా ఆ సినిమా హిట్ అయితే ఆ దర్శకులకి మంచి అవకాశాలు వస్తున్నాయి ..పిలిచి మరి నిర్మాతలు హీరోలు స్టోరీలు చెప్పమని అడుగుతున్నారు.. అడ్వాన్సులు ఇచ్చి మంచి స్టోరీ రాయమంటున్నారు.. గతంలో దర్శకులకి అవకాశాలకు చాలా సమయం పట్టేది.. ఇప్పుడు సినిమా హిట్ అయి మంచి

టాలెంట్ ఉంటే చాలు వెంటనే అవకాశాలు వస్తున్నాయి.

 

ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి .. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. గీతా ఆర్ట్స్ లో సినిమా చేయాలి అని చాలా మంది దర్శకుల కల అంత పెద్ద బ్యానర్ అది, అయితే తాజాగా దర్శకుడు సందీప్ రాజ్ అవకాశం దక్కించుకున్నాడు అనే వార్త వినిపిస్తోంది, అది కూడా ఓ స్టార్ హీరోతో సినిమా అని టాక్ నడుస్తోంది, అయితే ఇంకా ఆ పేరు బయటకు రాలేదు

 

ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందిన చిత్రాలలో కలర్ ఫొటో ఒకటి. సందీప్ రాజ్ దర్శకత్వం లో ఈ సినిమా వచ్చింది

సో ఇక ఆయనకు మంచి ఫేమ్ వచ్చింది, తాజాగా గీతా ఆర్ట్స్ వారు తమ బ్యానర్లో ఒక సినిమా చేయమని సందీప్ రాజ్ తో చర్చించారు అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి హీరో ఎవరో తెలియాల్సి ఉంది.