జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి మంచి ఫ్లాట్ ఫామ్ గా నిలిచింది, చాలా మంది సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.. కమెడియన్లు అయ్యారు, అంతేకాదు చిత్ర సీమలో హీరోలుగా కూడా చేస్తున్నారు, అయితే అందులో ఒకరు అవినాష్. మిమిక్రీ ఆర్టిస్టుగా ఉన్న అవినాష్ కమెడియన్గా మారిపోయాడు. హీరో సాయి కుమార్ వాయిస్ సేమ్ అలాగే చేస్తారు ఆయన.
ఇక జబర్దస్త్ పుణ్యమా అని బాగానే సెట్ అయ్యాడు అవినాష్, అయితే ఇప్పుడు మాత్రం జబర్దస్త్ వల్లే తాను రోడ్డున పడ్డానంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆ షో కారణంగా అప్పుల పాలయ్యానంటున్నాడు, జబర్ధస్త్ టీమ్ వారు నాతో 10 లక్షలు కట్టించుకున్నారు అని తెలిపాడు.
యాంకర్ శ్రీముఖితో పాటు గెటప్ శ్రీను, చమ్మక్ చంద్రలు నాకు సాయం చేశారు అని తెలిపాడు, నేను జబర్ద్ స్త్ చేస్తున్న సమయంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది..బాండ్ కారణంగా ఉన్న ఫలంగా వెళ్లడానికి కుదరదు. దాంతో 10 లక్షలు కట్టి వెళ్లాడట. అయితే అవినాష్ కి దాదాపు బిగ్ బాస్ ద్వారా 40 లక్షల వరకూ వచ్చినట్లు తెలుస్తోంది, దీంతో ఆర్దికంగా ఉన్న కష్టాలు తీరాయట.