చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం ప్ర‌ముఖ హ‌స్య‌న‌టుడు మృతి

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం ప్ర‌ముఖ హ‌స్య‌న‌టుడు మృతి

0
96

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస విషాదాలు అల‌ముకుంటున్నాయి, ఈ ఏడాది మార్చి నుంచి క‌రోనా వైర‌స్ లాక్ డౌన్ వ‌చ్చింది, దీంతో ఒక్క సినిమా కూడా షూటింగ్ జ‌ర‌గ‌లేదు, అంతేకాదు థియేట‌ర్లు ఓపెన్ లేవు, ఈ స‌మ‌యంలో అంద‌రూ ఇంటి ప‌ట్టున ఉంటున్నారు, అయితే ప‌లువురు సీనియ‌ర్ న‌టులు అనారోగ్యంతో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.

తాజాగా మ‌రో న‌టుడు కూడా బీ టౌన్ లో మ‌ర‌ణించారు.. ప్రముఖ హాస్యనటుడు జగదీప్అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. బుధవారం రాత్రి 8:40 గంటలకు ఇది జరిగింది. కుటుంబ స‌భ్యులు అంద‌రూ శోక‌సంద్రంలో మునిగిపోయారు.

ఆయ‌న‌కు రేపు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.1939 మార్చి 29న జన్మించిన జగదీప్‌ అసలు పేరు సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ. అతడు బాలీవుడ్‌లో పలు సినిమాల్లో కమెడియన్‌‌గా, సహ నటుడిగా చేశారు, చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలు చేశారు, అరవైఏళ్లు సినిమాల్లో న‌టించారు, సుమారు 400 చిత్రాలు చేశారు ఆయ‌న‌, జ‌గ‌దీప్ మ‌ర‌ణ వార్త వినీ బిటౌన్ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.