బ్రేకింగ్ – బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ – అదరహో

Contestants who went into the Bigg Boss House

0
96

ఇక కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది బుల్లితెరలో బిగ్ బాస్ సీజన్ 5 చూసేందుకు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు అని తెలుస్తోంది. ఎప్పుడైనా సీజన్ ముందు రోజు హౌస్ లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తారు. నేడు ఇలానే ఎంట్రీ ఇచ్చారు అని తెలుస్తోంది. రేపు 5వ సీజన్ ప్రారంభం కాబోతుంది. కంటెస్టెంట్స్ పేర్లు లీకవుతూ వచ్చాయి. అయితే దాదాపు వారే హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది.

ఈరోజే కంటెస్టెంట్లను హౌస్లోకి పంపుతున్నారు నిర్వహకులు. అయితే ఇది సాయంత్రం వరకూ కొనసాగుతుంది అని తెలుస్తోంది.. వార్తల బట్టీ యాంకర్ రవి, యూట్యూబర్ సరయు, యానీ మాస్టార్, సీరియల్ హీరో మానస్, ఆర్జే కాజల్, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, సీరియల్ నటి ప్రియ, నటరాజ్ మాస్టర్, నటి శ్వేత వర్మ, లహరి హౌస్లోకి వెళ్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వెళ్లారు అనేది చూడాలి అంటే రేపు సాయంత్రం వరకూ వెయిట్ చేయాల్సిందే.కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ఈ పేర్లు వైరల్ అవుతున్నాయి. చూడాలి రేపు వీరిలో ఎంత మంది హౌస్ లో ఎంట్రీ ఇస్తారో .