Breaking- టాలీవుడ్​లో కరోనా కలవరం..ఆ హీరోకు పాజిటివ్

Corona disturbance in Tollywood..positive for that hero

0
80

ఈమధ్య సెలబ్రెటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. మొన్ననే యువ హీరో మంచు మనోజ్ కు కరోనా సోకగా తాజాగా మరో యంగ్ హీరోకు కరోనా నిర్ధారణ అయింది. ఈ నగరానికి ఏమైంది, పాగల్ సినిమాతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న హీరో విష్వక్ సేన్ కరోనా బారినపడ్డాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించాడు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో తనకు పాజిటివ్ గా తేలిందని తెలిపాడు. తన వ్యక్తిగత వైద్యుడి సలహా మేరకు అన్ని మార్గదర్శకాలు పాటిస్తూ ఐసోలేషన్ లో ఉన్నానని విష్వక్ సేన్ వెల్లడించాడు.