బిగ్ బాస్ కు కరోనా సెగ – అసలు ఏమైంది ? ఈ వార్తల్లో నిజం ఎంత ?

Corona effect on big boss show

0
87

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే సెప్టెంబర్ 5 నుంచి షో అని క్లారిటీ వచ్చేసింది. సమయం కూడా వచ్చేసింది. ఇక కంటెస్టెంట్లుగా తీసుకున్న వారు అందరూ కూడా ఇప్పటికే క్వారంటైన్ కి వెళ్లారు అనే వార్తలు వచ్చాయి. అయితే ఈసారి 10 రోజులు మాత్రమే క్వారంటైన్ ఉంటుంది అని కొన్ని వార్తలు వినిపించాయి.

అయితే మరో కొత్త వార్త రెండు రోజులుగా వైరల్ అవుతుంది. బిగ్ బాస్ క్వారంటైన్ లో ఉన్న కంటెస్టెంట్లలో ఇద్దరికి కరోనా పాజిటీవ్ అని వార్త వైర‌ల్ అవుతోంది. అయితే ఇందులో వాస్తవం ఉందా ? ఇది నిజమా అని చాలా మంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఆలోచనలో ఉన్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇది ఫేక్ అని తెలుస్తోంది.

కంటెస్టెంట్లు అందరూ బాగానే ఉన్నారని ఇది కేవలం లీకుల వీరుల పని అంటున్నారు బుల్లితెర అనలిస్టులు. యాంకర్ రవి, లోబో, కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవి, నటి లహరి, యానీ మాస్టర్, సిరి హన్మంత్, ట్రాన్స్ జెండర్ ప్రియాంక, నటి ప్రియ, నవ్య స్వామి, సరయు సుమన్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, కోమలి, వర్షిణి పేర్లు ఈ సారి కంటెస్టెంట్లు అని వినిపిస్తున్నాయి.