కరోనా కారణంగా షూటింగ్ లు బంద్అవ్వడంతో దొంగగా మారిన నటీ…..

కరోనా కారణంగా షూటింగ్ లు బంద్అవ్వడంతో దొంగగా మారిన నటీ.....

0
97

కరోనా కారణంగా షుటింగ్ లు అన్ని బంద్ అయ్యాయి… దీంతో బుల్లితెర నటులు వెండితెర నటులు ఇంటికే పరిమితం అయ్యారు… ఇక ఇండస్ట్రీనే నమ్ముకున్న జూనియర్ ఆర్టిస్టులు షూటింగ్ లు బంద్ అవ్వడంతో వేరే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి… అయితే ఒక బుల్లితెర సీరియల్ నటి దొంగగా మారింది… అవును మీరు విన్నది నిజమే…

బుల్లితెరలో ప్రసారం అయ్యే దేవతతో సహా ఇతర సీరియల్స్ లో నటించే సుచిత్ర తన ప్రియుడితో కలిసి దొంగతనాలు మొదలు పెట్టింది.. ఈ దొంగతనం ఎక్కడో కాదు ప్రియుడి ఇంట్లోనే చేసింది అదికూడా ప్రియుడితో కలిసి… కరోనా కారణంగా డబ్బులు ఇబ్బంది అవ్వడంతో సుచిత్ర ప్లాన్ మేరకు ప్రియుడు మణికందన్ తన తండ్రి ఇంటిలోనే యాబైవేలు నగదు 18 సవరాలు బంగారంతో పరరీ అయ్యారు…

ఇక విషయం తెలుసుకున్న మణికందన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. ఈ దర్యాప్తులో భాగంగా మణికందన్ ను విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది… తామే ప్లాన్ చేసి ఇలా చేశాని చెప్పాడు… కాగా మణికందన్ కు ఇంతకు ముందే వివాహం అయింది అది తెలిసి కూడా సుచిత్ర అతనితో సహజీవనం చేస్తోంది…