కరోనా కట్టడికి రామ్ చరణ్ భారీ విరాళం..

కరోనా కట్టడికి రామ్ చరణ్ భారీ విరాళం..

0
148

చైనాలో పుట్టిన ఈ సుక్ష్మ జీవి కరోనా వైరస్ అతి తక్కువ సమయంలోనే ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది… ఇప్పుడు ఈ వైరస్ భారత దేశానికి కూడా వ్యాపించింది.. దీన్ని నివారించేందుకు దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే… ఈ నేపథ్యంలోనే ఈ వైరస్ ను అరికట్టేందుకు తమవంతు సహాయంగా పలువురు ప్రముఖులు విరాళం ప్రకటిస్తున్నారు…

తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో రామ్ చరణ్ ఈ వైరస్ ను అరికట్టేందుకు తన వంతు సహాయంగా ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 70 లక్షలను విరాళంగా ప్రకటించారు… కరోనా కట్టడి కోసం ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు చేస్తున్న కృషి అమోఘమని తన బాబాయ్ పవన్ కళ్యాణ్ స్పూర్తితో ఈ విరాళాన్ని ఇస్తున్నానని తెలిపారు…

ఇక రామ్ చరణ్ విరాళం ప్రకటించడంపై పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.. కరోనా వైరస్ అరికట్టేందుకు చరణ్ 70 లక్షలు విరాలాన్ని ప్రకటించడాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని తెలిపాడు… కాగా పవన్ అంతకు ముందు కేంద్ర ప్రభుత్వానికి కోటి, ఎపీకి 50 లక్షలు తెలంగాణకు 50లక్షలు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే…