క‌రోనా క‌ట్డడికి రామ్ చ‌ర‌ణ్ భారీ సాయం ? ప్ర‌శంసించిన ప‌వ‌న్ క‌ల్యాణ్

క‌రోనా క‌ట్డడికి రామ్ చ‌ర‌ణ్ భారీ సాయం ? ప్ర‌శంసించిన ప‌వ‌న్ క‌ల్యాణ్

0
138

క‌రోనా క‌ట్ట‌డికి పెద్ద ఎత్తున ప్ర‌భుత్వానికి సాయం అందిస్తున్నారు సినిమా పెద్ద‌లు, అలాగే యంగ్ హీరోలు కూడా త‌మ‌కు తోచిన సాయం చేస్తున్నారు, తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మొత్తానికి తెలుగు రాష్ట్రాల‌కు 50 ల‌క్ష‌లు చొప్పున మొత్తం కోటి రూపాయ‌లు ప్ర‌క‌టించారు, అలాగే ప్ర‌ధాని స‌హ‌య‌నిధికి మ‌రో కొటి అందించ‌నున్నారు.

ఈ స‌మ‌యంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ తేజ్ కూడా విరాళం ప్ర‌క‌టించారు.. యంగ్ హీరో రామ్ చరణ్ తేజ్ రూ. 70 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయనిధులకు ఈ విరాళాన్ని ఇవ్వనున్నాడు. . తన బాబాయ్ పవన్ కల్యాణ్ స్ఫూర్తితో తాను ఈ విరాళాన్ని ఇస్తున్నానని చెప్పాడు చ‌ర‌ణ్.

దీనిపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా త‌న సంతోషం తెలిపారు, రూ. 70 లక్షల విరాళాన్ని ప్రకటించిన చరణ్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని ట్వీట్ చేశారు.