Flash- బాలీవుడ్ హాట్ బ్యూటీకి కరోనా పాజిటివ్

Corona positive for Bollywood hot beauty

0
98

కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మరో బాలీవుడ్ భామకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. హాట్ బ్యూటీ ఇషా గుప్తా కొవిడ్‌ బారిన పడింది.

ఈ విషయాన్నీ ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం నేను ఐసోలేట్‌ లో నిబంధనలు పాటిస్తున్నాను. ప్రస్తుతం హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నాను. కరోనా నుంచి కోలుకొని స్ట్రాంగ్‌గా తిరిగి వస్తాను. దయచేసి అందరూ సురక్షితంగా ఉండండి. మాస్క్‌ ధరించండి. మిమ్మల్ని, ఇతరులను జాగ్రత్తగా చూసుకోండి. అని చెప్పుకొచ్చింది ఇషా గుప్తా.