టాలీవుడ్ నటులు ఒక్కొక్కరు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే మంచు లక్ష్మి సహా పలువురు నటులు మహమ్మారి బారిన పడగా తాజాగా హీరో నటకిరీటి రాజేంద్రప్రసాద్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. కొవిడ్ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.