Flash- ప్రముఖ సినీ నటికి కరోనా పాజిటివ్

Corona positive for popular movie actress

0
75

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మూడో వేవ్ వచ్చే అవకాశం కూడా ఉందని కొందరు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సినీ పరిశ్రమలో కూడా కరోనా మహమ్మారి మళ్లీ టెన్షన్ పెంచుతోంది. యువనటి ప్రగ్యా జైశ్వాల్ ఇటీవలే రెండోసారి కరోనా బారిన పడటం కలకలం రేపింది.

తాజాగా రామ్ గోపాల్ వర్మ ‘రంగీలా’ భామ, రాజకీయ నాయకురాలు ఊర్మిళ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం బాగానే ఉన్నానని.. హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నానని చెప్పారు. గత 15 రోజులుగా తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.