బ్రేకింగ్ – మ‌రో ప్ర‌ముఖ స్టార్ హీరోకి ఆయ‌న భార్య‌కి క‌రోనా

బ్రేకింగ్ - మ‌రో ప్ర‌ముఖ స్టార్ హీరోకి ఆయ‌న భార్య‌కి క‌రోనా

0
126

చిత్ర ప‌రిశ్ర‌మ‌ని ఈ కరోనా వేధిస్తోంది, ఇప్ప‌టీకే బీ టౌన్ షేక్ అయింది అని చెప్పాలి, ఓ ప‌క్క ప్ర‌ముఖ న‌టులు చాలా మంది వైర‌స్ బారిన ప‌డ్డారు.. బిగ్ బి కుటుంబంలో న‌లుగురికి క‌రోనా సోకింది, ప‌లువురు హీరోల‌కి కూడా వైర‌స్ సోకడంతో వారు అంద‌రూ ఇంటి ప‌ట్టున ఉంటున్నారు.

సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కూ ఎవ‌రిని ఇది వ‌ద‌ల‌డం లేదు, తాజాగా క‌న్న‌డ స్టార్ హీరోకి వైర‌స్ సోకింది,ప్రముఖ కన్నడ నటుడు ధృవ్ సర్జాకు, అతని భార్య ప్రేరణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈవిషయాన్ని ధృవ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

దీంతో క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌తో పాటు ఆయ‌న అభిమానులు షాక్ అయ్యారు, ఆయ‌న కుటుంబంలో స‌భ్యులు అలాగే ఆయ‌న ద‌గ్గ‌ర సిబ్బంది అంద‌రూ కూడా టెస్ట్ చేయించుకుంటున్నారు, ఇక త‌న‌ని క‌లిసిన వారు ఎవ‌రైనా ఉంటే టెస్ట్ చేయించుకోండి ..తాము ఇద్ద‌రం హ‌స్ప‌ట‌ల్ లో చికిత్స తీసుకుంటున్నాం అని తెలిపాడు ధృవ్..జూన్‌లో గుండెపోటుతో మరణించిన నటుడు చిరంజీవి సర్జాకు ధృవ్ తమ్ముడు. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ సోదరి కొడుకులు వీరిద్ద‌రూ..