Breaking: మళ్లీ కరోనా బారినపడ్డ స్టార్ హీరో..

0
96

ఇటీవలే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందడంతో తీరని విషాదం చోటు చేసుకుంది. మరికొంతమంది చావుదాకా వెళ్లి బయట పడిన సంఘటనలు కూడా సినీపరిశ్రమలో చోటుచేసున్నాయి. తాజాగా అక్షయ్ కుమార్ మరోసారి కరోనా మహమ్మారి బారిన పడిన విషయాన్నీ స్వయంగా తానే ట్వీట్ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం తాను విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలపడంతో పాటు కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు దూరమైనట్టు ఆవేదన వ్యక్తం చేశాడు.