దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో టెన్షన్ నెలకొంది. సినీ పరిశ్రమను కరోనా ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. టాలీవుడ్ లో ఇప్పటికే ప్రిన్స్ మహేష్ బాబు,థమన్, మంచు లక్ష్మి, బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారు. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె గుడ్ లక్ సఖి, సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది.