కరోనా వల్ల ఆ స్టార్ ప్రొడ్యుసర్ కు భారీ నష్టం వచ్చిందట..

కరోనా వల్ల ఆ స్టార్ ప్రొడ్యుసర్ కు భారీ నష్టం వచ్చిందట..

0
98

కరో వైరస్ ను అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది.. దీని ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై కూడా పడింది… దీంతో ఎన్నో సినిమాలు విడుదల వాయిదా పడ్డాయి… షుటింగ్ లు కూడా నిలిచిపోయాయి… సిని కార్మికులు కూడా ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు… ఇక టాలీవుడ్ విషయానికి వస్తే కరోనా వల్ల బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుకు భారీ నష్టం వాటిల్లిందని ఫిలిం నగర్ లో చర్చించుకుంటున్నారు…

ఆయన నిర్మాతగా వహించిన చిత్రం వీ.. ఈ చిత్ర ఉగాది పండుగకు విడుదల కావాల్సి ఉంది… ఈ చిత్రంలో నాని సుదీప్ బాబు లు నటించారు అయితే కరోనా ఎఫెక్ట్ తో ఈ సినిమా వాయిదా పడింది… అలాగే పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న వకీల్ సాబ్ మూవీ కూడా షూటింగ్ సగం పూర్తి చేసుకుంది.. ఈ సినిమాపై కూడా కరోనా ప్రభావం పడింది…

ఇప్పటివరకు దిల్ రాజు ఈ సినిమా పై 30 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.. అలాగే ఇంద్రగంటి హోహన్ కృష్ణ దర్శకత్వంలో తయారైన మరో చిత్రం కోసం దిల్ రాజు 40 కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం… థియేటర్లనుంచి వచ్చే ఆదాయం కూడా నిలిచిపోయింది దాంతో ఇతర నిర్మాతలతో పోల్చితే దిల్ రాజుకు కరోనా వల్ల ఎక్కువ నష్టం వాటిల్లిందని అంటున్నారు…