ప్రతి హీరోయిన్ ఏదో ఒక కాస్మోటిక్ సర్జరీ(Cosmetic Surgeries) చేయించుకుంటారని, అవకాశాల కోసమో.. ఇంకా అందంగా కనిపించాలనో వారు ఈ సర్జరీల బాట పడతారు. తాజాగా ఇదే విషయంపై బాలీవుడ్ భామ కృతిసనన్(Kriti Sanon) స్పందించారు. ఒకవైపు హీరోయిన్‌గా తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేస్తున్న ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తాజాగా నిర్మాతగా కూడా తొలి సక్సెస్‌ను అందుకున్నారు. ‘దో పత్తి’ అనే సినిమాను నిర్మించిన కృతి ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించి నిర్మాతగా కూడా సూపర్ అనిపించుకున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ సర్జరీల ప్రస్తావన తెచ్చారు. వాటి గురించి తాను పెద్దగా మాట్లాడనని, అందం విషయంలో తాను ఎవరికీ సలహాలు ఇవ్వనని అన్నారు.
‘‘ఎప్పుడు అందంగానే కనిపించాలనుకునే వారు మహిళలు. అలాగని ఈ విషయంలో వారిపై ఒత్తిడి తీసుకురాకూడదు. అందంగా కనిపించాలని శరీరభాగాలకు సర్జరీలు చేయించుకునే వారి విషయంలో నేను ఏ తీర్పు చెప్పను. అది వారి నిర్ణయం. శరీరంలో ఒక్కభాగంగా ఏదో కాస్తంత మార్పు రాగానే అందంగా కనిపిస్తామని అనుకుంటే ఏమైనా చేయించుకోవచ్చు. ఆ తర్వాత దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్‌ను కూడా వాళ్లే ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ జీవితం, మీ అందం వాటి విషయంలో నేను ఎలాంటి సలహాలు ఇవ్వను. అందం విషయంలో నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. నా ఫొటోలకు ఫిల్టర్లు కూడా వేయను. ఎవరైనా నన్ను అడిగినా సర్జరీ వంటి సలహాలు నేను ఇవ్వను. మీ ఇష్టం అని చెప్పేస్తాను’’ అని కృతి(Kriti Sanon) చెప్పుకొచ్చింది.