కంగనాకు నోటీసులు.. 24 గంటలే టైమా..!

-

బాలీవుడ్ భామ కంగనా రనౌత్‌(Kangana Ranaut)కు తన తాజా సినిమా ‘ఎమర్జెన్సీ(Emergency)’ చిక్కులు తెచ్చిపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా విషయంలో అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సినిమా సిక్కు సమాజాన్ని కించపరిచేలా ఉందంటూ పలువురు పేర్కొన్నారు. కావున ఈ సినిమా విడుదలను నిషేధించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా వ్యవహారంలోనే కంగనా రనౌత్‌కు మధ్యప్రదేశ్(Madhya Pradesh) హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒక వర్గానికి చెందిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఈ సినిమా చిత్రీకరణ జరిగిందని కోర్టు తన నోటీసుల్లో పేర్కొంది. కంగనాతో పాటు కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

అంతేకాకుండా ఈ సినిమాకు తెరకెక్కించిన మణికర్ణిక ఫిల్మ్స్‌, ఈ సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డుకు, జీ స్టూడియోస్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే తన సినిమాను అడ్డుకోవడానికి ఎక్కడలేని ప్రయత్నాలు జరుగుతాయిన కంగనా రనౌత్ చెప్పుకుంటూనే వచ్చారు. ఈ క్రమంలో కోర్టు నోటీసులు రావడంతో ఈ సినిమా వాయిదాకు అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది. అంతేకాకుండా నోటీసులకు 24 గంటల్లో స్పందించాలని కోర్టు కోరినట్లు సమాచారం. ఈ సినిమా కేసు విచారణ నేడు జరగనున్న క్రమంలో కంగనా రనౌత్(Kangana Ranaut) ఏమని వివరణ ఇస్తుంది అనేది హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: అలియా ‘ఆల్ఫా’లో మరో స్టార్ హీరో! ఎవరో తెలుసా..?
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...