కంగనాకు నోటీసులు.. 24 గంటలే టైమా..!

-

బాలీవుడ్ భామ కంగనా రనౌత్‌(Kangana Ranaut)కు తన తాజా సినిమా ‘ఎమర్జెన్సీ(Emergency)’ చిక్కులు తెచ్చిపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా విషయంలో అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సినిమా సిక్కు సమాజాన్ని కించపరిచేలా ఉందంటూ పలువురు పేర్కొన్నారు. కావున ఈ సినిమా విడుదలను నిషేధించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా వ్యవహారంలోనే కంగనా రనౌత్‌కు మధ్యప్రదేశ్(Madhya Pradesh) హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒక వర్గానికి చెందిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఈ సినిమా చిత్రీకరణ జరిగిందని కోర్టు తన నోటీసుల్లో పేర్కొంది. కంగనాతో పాటు కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

అంతేకాకుండా ఈ సినిమాకు తెరకెక్కించిన మణికర్ణిక ఫిల్మ్స్‌, ఈ సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డుకు, జీ స్టూడియోస్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే తన సినిమాను అడ్డుకోవడానికి ఎక్కడలేని ప్రయత్నాలు జరుగుతాయిన కంగనా రనౌత్ చెప్పుకుంటూనే వచ్చారు. ఈ క్రమంలో కోర్టు నోటీసులు రావడంతో ఈ సినిమా వాయిదాకు అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది. అంతేకాకుండా నోటీసులకు 24 గంటల్లో స్పందించాలని కోర్టు కోరినట్లు సమాచారం. ఈ సినిమా కేసు విచారణ నేడు జరగనున్న క్రమంలో కంగనా రనౌత్(Kangana Ranaut) ఏమని వివరణ ఇస్తుంది అనేది హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: అలియా ‘ఆల్ఫా’లో మరో స్టార్ హీరో! ఎవరో తెలుసా..?
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘జర్నలిస్టులను బాధపెట్టొద్దు’.. సీఎం రేవంత్‌కి బండి సంజయ్ లేఖ..

‘‘బతుకమ్మ పండుగ ముందర కరీంనగర్ జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగింది. గత...

హర్యానా ఎన్నికల్లో వినేష్ ఫోగట్ ఘన విజయం

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్(Vinesh Phogat) ఘన...